జనగామ: ఈ రోజు జిల్లాలో 30 రోజుల గ్రామ అభివృధి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ జిల్లా పర్యటనలో రఘునాథ్ పల్లి మండలంలోని బాంజిపేట గ్రామంలో ప్రియాంక వర్గీస్ 30 రోజుల కార్యచరణలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. బాoజీపేట గ్రామంలో రోడ్లకు ఉన్న గుంతలను పూడ్చి రోడ్లు నీట్ గా ఉంచుకోవాల్సినదిగా గ్రామ సర్పంచ్, శ్రీమతి భాగ్యనీ ఆదేశించారు. గ్రామ వీధులలో సందర్శించి ఇంటింటికి ఆరు ముక్కలు పెట్టారా? లేదా అనే విషయంలో ఒక ఇంటి ఆవరణలో పెట్టిన మొక్కలను పరిశీలించారు. గ్రామం ఇరువైపులా మొక్కలు నాటవలసిందిగా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ ప్రాంగణంలో సమావేశం జరిగింది…