జనగామ: జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిన వైద్యుడితో రోగులకు అధికారులు చికిత్స చేయించారు. జిల్లా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా సోకింది. కరోనా వచ్చిందన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినా వినకుండా డ్యూటీ చేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేసేదేమీలేక ఆ వైద్యుడు విధలు నిర్వర్తించాడు. అయితే కరోనా సోకిన వైద్యుడిని క్వారంటైన్‌కు పంపించాల్సిన అధికారులు.. డాక్టర్‌తో డ్యూటీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.