పల్లెల్లో, గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. ఒకరినొకరు కొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే చిన్న పాటి గొడవలు తగాదాలకే కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకొని జీవితాల్ని అర్థంతరంగా ముగిస్తున్నారు. చెప్పుతో కొట్టాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.. జిల్లాలోని రఘునాథపల్లి మండలం కుసుమ భాయ్ తండా గొడవ జరిగింది.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఘర్షణలో భాగంగా ఎల్లేష్పు అనే వ్యక్తిని సర్పంచి రమేష్ చెప్పుతో కొట్టాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపంకు గురయ్యాడు. అందరి ముందు తనకు జరిగిన అవవమాన భారాన్ని భరించలేకపోయాడు. దీంతో ఎల్లేష్పు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లేష్పు మృతితో బంధువులు నిరసకు దిగారు. అతడి ఆత్మహత్యకు సర్పంచ్ కారణమంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సర్పంచ్ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.