బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ‘థడక్’ సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. దివంగత నటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

జాన్వీ ఫ్యాషన్ సెన్స్‌కు ఆధునిక యువత ఫిదా అవుతున్నారు. తాజాగా జాన్వీ ముంబైలో ఫొటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. ఈ సందర్భంగా ఆమె వైట్ స్నీకర్స్, బ్లాక్ స్లింగ్ బ్యాగ్‌తో పాటు బాడీ కలర్ పెన్సిల్ డ్రెస్ ధరించింది. తక్కువ మేకప్‌ వేసుకుని, కురులను లూజుగా వదలివేసింది. ఆమెను చూసినవారంతా జాన్వీని హాలీవుడ్ నటి కిమ్ కర్డషియాన్‌తో పోలుస్తున్నారు.

ఈ లుక్‌లో జాన్వీని చూసిన అభిమానులు డంగైపోతున్నారు. కాగా ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్’, ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు.