జాబ్ రాలేదని కొందరు, ప్రేమ విఫలం అయ్యిందని కొందరు, కడుపునొప్పి అని మరికొందరు, ఇలా ఏ కారణాలు ఐన, ఆత్మహత్యే పరిష్కారం అనుకొనే నేటి యువతీ యువకులకు ఆదర్శం ఈ 70 ఏళ్ల మహిళ జీవితం: బతుకు కోసం ఒంటరి ప్రయాణం, ఎవరికి తలవంచని ధీరత్వం, ముసలి తనం మీదపడుతున్నా.. దేహం ఉంది..! నెత్తురుంది…! సత్తువుంది…! ప్రాణముంది..!జీవన పోరాటానికి ఇది చాలవా అనుకొన్న ఆమెకు జీవన పోరాటానికి వేరే సైన్యం అవసరమా…?

  • కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఒకరి మీద ఆధారపడి జీవనం సాగించే గుణం కాదు ఆమెది, కన్న కొడుకు తల్లిని చేరదీసే నైజం ఉన్నా, అతని వద్దకు చేరని ధీరత్వం గుంటూరులో నివాసం ఉండే యల్లమందమ్మది.
  • డైబ్బై ఏళ్ల యల్లమందమ్మ తెల్లవారగానే సద్ది కట్టుకొని గడ్డి కోసం సైకిలెక్కి 4 కి.మీ ప్రయాణిస్తుంది. గడ్డిమోపు తీసుకొచ్చి రూ.100లకు అమ్ముతుంది. ఇలా నాలుగేళ్ల నుంచి ఈమెకు జీవనాధారం.
  • విశేషమేంటంటే దారిలో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో దగ్గర్లోని తెనాలి రైలు ట్రాక్‌పై (రోజుకు మూడు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగించే ట్రాక్‌) గడ్డిమోపుతో ఉన్న సైకిల్‌ను తోసుకుంటూ వస్తుంది. ఎంతో అనుభవం ఉన్నవారికీ సాధ్యం కాని, ఈ పనిని సునాయాసంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈమె గమనం నిజంగా ఆదర్శనీయం..
  • డకాగా యువతీ యువకులే ఉద్యోగం లేకపోతే కూర్చుని తినాలి అనుకొంటున్న సమయంలో కూర్చుని తినే వయసులో కష్టపడి బతుకుతున్న యల్లమందమ్మకు హృదయ పూర్వక పాదాభివందనం.