జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి గారి ఆద్వర్యంలో జరిగిన పోలీసు డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యాక్రమం…

ఈరోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ లో జరిగిన జిల్లా పోలీసు డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యాక్రమం జిల్లా అదనపు యెస్.పి శ్రీ.కృష్ణమూర్తి గారు నిర్వహించారు. ఈ సంధర్భంగా అదనపు యెస్.పి గారు మాట్లాడుతూ: అత్యవసర సమయాల్లో పోలీస్ డ్రైవర్లు చూపే చొరవ అత్యంత కీలకమైనదని వారు అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల సంఘటల స్థలానికి చేరుకోవచ్చని తెలిపినారు. బ్లూ కొట్స్, పెట్రోలింగ్ వాహన డ్రైవర్ల సిబ్బందికి డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన 5 అంశాల గురించి వివరించడం జరిగియండి.

1) డయల్ 100 కాల్ అటెండ్ కావడం, 2) వినడం, 3) ప్రశ్నించడం, 4) సమస్య పట్ల సానుభూతి చూపడం మరియు 5) ప్రజల పట్ల సేవా భావం కలిగి వుండడం, అనే అంశాలపై అవగాన కల్పించారు. అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్య కానీ బాధకాని కల్గినపుడే డయల్ 100 కాల్ చేయడం గాని, పోలీస్టేషన్ కి రావడం జరుగుతుందని అలాంటి సమయంలో వారి యొక్క భాధను వినమ్రతతో విని వినయంతో సమాధానం చెప్పి వారి సమస్య పరిష్కరించాని అన్నారు, సిబ్బంది ఎప్పుడు ప్రజా సేవకు అందుబాటులో వుండాలని తెలిపినారు.అలాగే పోలీసు డ్రైవర్లు అందరూ కూడా మోటారు వాహన చట్టం యొక్క నియమ నిభందనలు పాటించాలని అన్నారు.