పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీమతి. చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రజావాణిలో బాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదిదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే ఫిర్యాదిదారులు తిరిగి తమను సంప్రదించవలసిందిగా కోరినారు. ఈ ప్రజవాణి లో భాగంగా మెదక్ పట్టణం దుర్గ కాలనికి చెందిన సంపంగి వెంకటమ్మకు సంపంగి ఎల్లయ్యతో 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగినదని, వీరికి ముగ్గురు ఆడపిల్లలు వున్నారని, తన భర్త పెళ్లి జరిగిన సంవత్సరం నుండే ప్రతి రోజు తాగి వచ్చి తనని తన పిల్లలను వేదిస్తున్నాడని, నానా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టి నచ్చ చెప్పిన తన తీరు మారడంలేదని, తన భర్త వల్ల తనకు తన పిల్లలకు ప్రాణహాని వున్నదని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా, ఎస్.పి. గారు స్పందిస్తూ బాధితురాలికి చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని, చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని మెదక్ డి.ఎస్.పి. గారికి సూచించడం జరిగినది.

అలాగే వెల్దుర్తి మండలం యశ్వంతరావ్ పేట్ గ్రామానికి చెందిన ఏ.డి.కె ప్రభకార్ తాను ముధిరాజ్ కులానికి చెందిన వాడనని, తమ గ్రామం లో తమ కులపెద్దలు చేస్తున్న అక్రమాలను నిలదీసినందుకు తనను తన గ్రామ పెద్దలు 2010 సంవత్సరంలో కుల భహిష్కరణ చేసినారని ఇట్టి విషయాన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేయగా తన పైన ఉన్న కుల భహిష్కరణ ఎత్తివేసినారని,

కానీ కుల సంఘంలో సబ్యత్వం ఇవ్వలేదని, ఆ తర్వాత 2016 సంవత్సరంలో మా కులానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన చేప పిల్లల విషయంపైన జరిగిన అక్రమాలను ఎత్తి చూపినందుకు మళ్ళీ తనని కుల భహిష్కరణ చేసినారని, అప్పటి నుండి మా గ్రామంలో మరియు మా చుట్టూ పక్క గ్రామాల్లో తమ కులం వారు తనని తన కుటుంబాన్ని మంచి చెడులకు దేనికి పిలవటం లేదని, అంతేకాకుండా తనకి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు తనకు రానివ్వటం లేదని కావున ఇట్టి విషయంలో తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ ఫిర్యాదిదారుడికి చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని, చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని తూప్రాన్ సి.ఐ. గారికి సూచించడం జరిగినది. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదిదారులు రావడం జరిగినది