ఆర్మూర్: జీపీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరుగలేదు. రూ.18 లక్షల50 వేలు అప్పు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాం. ఇందులో రూ.4 లక్షల50 వేలకు ఎంబీ రికార్డు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. ఈ సాకు చూపుతూ నన్ను 6నెలలు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ గడువు ముగిసినా చార్జ్ ఇవ్వలేదు. అప్పులవాళ్ల వేధింపులు పెరిగిపోయాయి. దీంతో నేను, నా భర్త ఇద్దరం వెళ్లి నెల కింద జీవన్​రెడ్డిని కలిసి, చార్జ్​ ఇవ్వాలని వేడుకున్నాం.

కలెక్టర్​ను కలవాలని చెప్తే సోమవారం కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్​ ఇద్దరినీ కలిశాం. స్పందించక పోవడంతో హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేను కలిసి వద్దామని నా భర్త అన్నాడు. చిన్నపిల్లలు ఉన్నందున నేను వెళ్లలేదు. మా ఆయన ఒక్కరే వెళ్లారు. కావాలని నా భర్తను కుట్ర పూరితంగా కేసులో ఇరికించారు.