ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్‌ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటికి సంబంధించి పూర్తి రిఫండ్‌ ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది. మార్చి 25కు ముందు బుక్ చేసుకున్న టికెట్లకు రిఫండ్‌ ఇస్తున్నట్లు చెప్పింది. శ్రామిక్‌, స్పెషల్‌ ట్రైన్స్‌ యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. టికెట్లు క్యాన్సిల్‌ చేయడంతో జూన్‌ 30 వరకు రైళ్లు నడిచే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.