జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన, శుక్రవారం బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే: తెలంగాణ మిస్‌ మోడల్‌కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపైన ఇద్దరు యువకులు పైశాచికంగా దాడి చేశారు. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా, మరో వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరించారు. ఆమెకు మద్యం తాగించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి గత నెల 28న బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం జనవరి 7న ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

దిశ హత్యచార నిందితుల ఎన్ కౌంటర్ ద్వారా, చిన్నారులు , ఆడవాళ్లపైలైంగిక దాడికి పాల్పడాలనుకునే వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని అందరూ భావించారు. వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు చూస్తుంటే, నిందితుల ఆలోచనల్లో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం అవుతోందనిమానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భయం ద్వారానే మార్పు వస్తుందని భావించడం కంటే, ప్రాథమిక దశ నుంచే ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు నేర్పేందుకు చర్యలు తీసుకొవాలని సూచిస్తున్నారు…