ఓ రాజకీయ నేతకు మాత్రం ఆయన భార్య షాకిచ్చింది. జూమ్ మీటింగ్‌లో ఉన్న సమయంలో నగ్నంగా నడుచుకుంటూ వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై మార్చి 30న పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. జూమ్‌లో నేషనల్ హౌస్ ఆఫ్ ట్రెడిషనల్ లీడర్స్ అంతా కరోనా గురించి చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో జోలైల్ ఎండీవు కూడా పాల్గొన్నారు. ఐతే అందరూ సీరియస్‌గా డిస్కస్ చేస్తున్న క్రమంలో ఎంపీ భార్య సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఆయన వెనకాల నుంచి నగ్నంగా నడుచుకుంటూ వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి నేతలంతా షాక్ తిన్నారు. పక్కను నవ్వారు. జోలైల్ ఎండీవుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పరువు తీసింది అన్నట్టుగా ముఖానికి చేతులు అడ్డంపెట్టుకున్నారు. ఐతే జూమ్ మీటింగ్‌లో ఓ నేత భార్య నగ్నంగా కనిపించడంతో కమిటీ ఛైర్ పర్సన్ ఫెయిత్ ముతాంబి అప్రమత్తమయ్యారు.

వెంటనే జూమ్ కాల్‌ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగ్నత్వం వల్ల జూమ్ మీటింగ్‌లకు ఆటంకాలు ఏర్పడిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2020 డిసెంబరులో లిథువేనియా రైట్ వింగ్ యాక్టివిస్ట్ పెట్రాస్ గ్రాజులిస్ ఓ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఐతే ఆయన వీడియో ఆఫ్ చేసి కేవలం ఆడియో మాత్రమే వింటున్నాడు. అంతలోనే అనుకోకుండా కెమెరా ఆన్ చేయడంతో ఆయన నగ్న దృశ్యాలు అందరికీ వెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన మళ్లీ కెమోరాను ఆఫ్ చేసి మీటింగ్‌లో పాల్గొన్నాడు.