మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన జోష్‌లో భారత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఇది కెప్టెన్ విరాట్ కోహ్లీకి 50వ మ్యాచ్‌ కావడం మరో విశేషం.

ఇక ఈ టెస్ట్‌లో విజయం సాధించాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఒక మార్పు చేసింది. హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక డెన్ పీడిట్ స్థానంలోఅన్రిచ్ నోర్జ్టేని సఫారీలు జట్టులోకి తీసుకున్నారు.

భారత జట్టు వివరాలు:

భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.