టిక్‌టాక్‌ ద్వార సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇది నిజం. తాజాగా హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్‌టాక్‌ స్టార్‌కుబిజెపి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండోసారి విడుదల చేసిన జాబితాలో ఆదంపూర్‌ నియోజకవర్గ స్థానాన్ని ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్‌కు కేటాయించింది.

సోనాలీ ఫొగాట్‌కు టిక్‌టాక్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నిత్యం ఆమె తన వీడియోలను పోస్ట్‌ చేస్తూ పేరు సంపాదించుకుంది. మరి ఈ క్రేజ్ ఆమెకు ఓట్లుగా మారుతాయో లేదు చూడాలి.