తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియార్ నివాసి అయిన టాక్సీ కారు డ్రైవర్ కుమారవేల్, నైవేలీ దిడీర్ కుప్పంకు చెందిన రాజేశ్వరి అనే ఓ యువతిని ప్రేమించాడు. తాను కూడా అతన్ని తిరిగి ప్రేమించగా ఇద్దరూ కలిసి పెద్దల అనుమతితో వివాహమాడారు. వారి ఎనిమిదేళ్ల దాంపత్యంలో ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. భర్త టాక్సీ డ్రైవర్ గా కాయకష్టం చేస్తూ తన భార్య, 7ఏళ్ల బాబు, మూడేళ్ళ పాపతో ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించేవాడు. కుమారవేల్ టాక్సీ డ్రైవర్ కావడంతో ప్రతిరోజు 12 గంటలపాటు బయట తిరుగుతూ డబ్బు సంపాదించేవాడు. ఈ సమయంలో భార్య రాజేశ్వరి ఒక్కతే ఇంట్లో ఉంటూ తన పిల్లల్ని చూసుకునేది. తన భర్త ఇంట్లో ఉన్న సమయంలో మాత్రం అతని స్మార్ట్ ఫోన్ ని బాగా వాడేది.

ఐతే గత కొన్ని వారాలుగా భర్త ఎక్కువగా నైట్ డ్యూటీ చేస్తూ పగలంతా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భార్య రాజేశ్వరి తన భర్త స్మార్ట్ ఫోన్ తో పొద్దస్తమానం కాలక్షేపం చేయడం ఆరంభించింది. ఇది గమనించిన భర్త ఫోన్ ఎక్కువగా వాడొద్దని లేని పోనీ ఆలోచనలు వస్తాయని ఆమెని లైట్ గా మందలించాడు. కానీ రాజేశ్వరి మాత్రం తన భర్త మాట వినకుండా స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ భీష్మించుకు కూర్చుంది. దాంతో చేసేదేమీ లేక ప్రేమించిన ప్రియురాలు అడుగుతుంది కాబట్టి, రేయింబవళ్ళు శ్రమించి తనకి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుండి రాజేశ్వరి టిక్ టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆమె వీడియోలకి మేల్ ఫాలోవర్స్ అధికంగా పెరిగిపోయారు. దాంతో ఆమె ఇంకా ఎక్కువ టిక్ టాక్ వీడియోలు చేస్తూ పలువురు మగవారితో సంభాషణలు కొనసాగించేది.

ఒకానొక సందర్భంలో భర్త కుమారవేల్ స్నేహితులు తన భార్య టిక్ టాక్ వీడియోలని చూసి ‘ఈమె నీ భార్య కదా?’, అంటూ మొహం పట్టుకొని అడిగారు. దాంతో భార్య తన వీడియోలని బహిరంగంగా షేర్ చేస్తూ తనకి తలవంపులు చేస్తుందని అవమానంగా భావించాడు. ఇంటికి వెళ్లి ఆమెను గట్టిగా మందలించాడు. కానీ ఆమె మాత్రం టిక్ టాక్ వీడియో లను చేయడం మానలేదు. దాంతో పాత ఇంటి నుండి వేరే ప్రదేశానికి వెళతే వాతావరణం మారి తనపై ఏదైనా మార్పు వస్తుందని భర్త భావించాడు. అనుకున్నదే తడవుగా వేరే ఏరియాలోని ఓ అద్దె ఇంటికి మకాం మార్చాడు. అయితే తన టిక్ టాక్ ఫాలోయర్స్ లో ఒకడైనా మురుగన్ కూడా ఆ ఏరియా లోనే నివసించేవాడు. దాంతో భర్త లేనప్పుడు రాజేశ్వరీ మురుగన్ ని ఇంటికి రప్పించి అతనితో చనువుగా మాట్లాడేది. కాలక్రమేపి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

కేవలం ఒక్క మురుగన్ తోనే కాకుండా రాజేశ్వరి మిగతా టిక్ టాక్ ఫాలోవర్స్ కి కూడా ఫోన్లు చేస్తూ శృంగార సంభాషణలు కొనసాగించేది. అప్పుడప్పుడు వారిలోని కొంత మందిని కలిసి శృంగారంలో పాల్గొనేది. అయితే ఒకరోజు రాజేశ్వరి, మురుగన్ శృంగారంలో తేలిపోతుండగా భర్త కుమారవేల్ తన ఇంటికి రాగా, భార్య గుట్టురట్టయింది. అది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన భర్త తన కారులోనే జాకీ ని తీసుకొచ్చి తన భార్యని, ప్రియుడిని బలంగా కొట్టాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే చనిపోగా, మురుగన్ మాత్రం కొన ఊపిరితో బయటపడ్డాడు. అయితే తన కూతురిని కుమారవేల్ చంపేశాడని రాజేశ్వరి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు రాజేశ్వరి 300 టిక్ టాక్ వీడియోలు చేసిందని, పలువురు టిక్ టాక్ వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అది తెలిసిన భర్త కుమారవేల్ తట్టుకోలేక ఆమెని హత్య చేశాడని తెలిపారు…