లాంఘజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ అర్పిత లాకప్ ఎదుట పాటకు డాన్స్ చేస్తూ టిక్ టాక్ రూపొందించారు. ఈ నేపధ్యంలో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. జూలై 20న రూపొందిన ఈ వీడియో వైరల్ గామారింది. నాలుగు రోజుల్లో 12 వేల మంది దీనిని వీక్షించారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. కాగా అర్పిత ఇప్పటివరకూ 15కు మించిన టిక్‌టాక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2016లో అర్పిత పోలీసు విభాగంలో ఎల్ఆర్డీగా చేరారు. అంతకు ముందు ఆమె లాంఘజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు.