కరోనా కేసులు పెరుగుతున్నందున షాపులు మూసేయాలంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా లీడర్ హల్‌చల్ చేసింది. బేగం బజార్‌లో కరోనా వ్యాప్తిచెందుతున్నందువల్ల రోజూవారీ సమయానికంటే ముందుగానే షాపులు మూసేయాలని టీఆర్ఎస్ లీడర్ శాంతిదేవి, ఆమె అనుచరులు హంగామా సృష్టించారు. సోమవారం రాత్రి షాప్ క్లోజ్ చేయాలంటూ ఓ షాప్ ఓనర్‌ను బెదిరించారు. అయితే షాప్ ఓనర్ శాంతిదేవిపై తిరగబడ్డాడు. నువ్వేమైనా అధికారివా ? నీకేం సంబంధం అంటూ ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన శాంతిదేవి అనుచరులతో కలిసి షాప్ ఓనర్‌పై దాడి చేసింది. సీసీ కెమెరాల్లో ఆ దాడికి చెందిన విజువల్స్ రికార్డయ్యాయి. బాధిత ఓనర్ ఫిర్యాదుతో శాంతిదేవితో పాటు ఆమె అనుచరులు ముగ్గురిపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.