కొవిడ్‌ టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం వల్ల వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ల బారినపడే ముప్పు ప్రజలకు పెరుగుతుందని అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని గతనెలలో భారత ప్రభుత్వం పెంచడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌కు ఈ విరామం 3 వారాలుగా, మోడెర్నా టీకాకు అది 4 వారాలుగా ఉంది. దాన్ని మరింత పొడిగించడం వల్ల ప్రజలు కరోనాలో కొత్త వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉంది. బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. షెడ్యూల్‌ ప్రకారం టీకాలు వేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు.