తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే పదిమంది ఉద్యోగులకు కరోనా వ్యాధి సోకింది. నలుగురు సన్నాయి వాద్యకారులు, ఒక పూజారి, సెక్యూరిటీ సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈమేరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీలో కరోనాపై క్లారిటీ ఇచ్చారు. కరోనా సోకినవారందర్నీ వెంటనే గుర్తించి ఐసోలేషన్ కి పంపించామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కి తరలించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్ని డిసిన్ఫెక్షన్ చేయిస్తున్నామని అన్నారు. అయితే తిరుమలకు వచ్చిన భక్తుల్లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శనాలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యను పెంచే అవకాశం లేదని ఆయన చెప్పారు.