బుల్లితెర నటి, టీవీ యాంకర్ శాంతి ( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజినీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆమె ఎలా చనిపోయిందనే దానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని, నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
కాగా ఆర్థిక ఇబ్బందుల‌తో ప్రేమ వ్య‌వ‌హార‌మే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మై ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.