చేర్యాల శ్రీ కొమురవెళ్లి మల్లన్న దేవాలయంలో నేడు రాజగోపుర కుంభాభిశేక పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి చిఫ్ విప్ వేంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు, అనంతరం కొమురవెళ్లి మల్లన్న గుట్టపై రూ.53లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయ మహా మండపం నిర్మాణ పనులకు, కింద అతిథి గృహానికి శంకుస్థాపన చేసి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నిర్మాణాలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్షించి అభివృద్ధి నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దు తొందరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం రూ.30లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తు భవన నిర్మాణంలో 6 గదుల ధర్మశాలను, రూ.58లక్షలతో నిర్మించిన డార్మిటరీ హాల్-అన్నదాన సత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని. రాజగోపుర మహా కుంభాభిషేక పుష్కరోత్సవమంటే 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహాత్కార్యం.

గత 12 ఏళ్ల క్రితం జరిగిన కార్యక్రమంలో మేము పాల్గొనే అదృష్టం లేకున్నా ఈ యేడు మల్లన్న స్వామి అనుగ్రహం ఆశీస్సులతో ఆ భాగ్యం మాకు కలిగింది. కొమురవెళ్లి అన్నీ క్షేత్రాల కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. భక్తులు కొంగు బంగారంగా కొలిచే కొమురెళ్లి కోర మీసం. మల్లన్న సన్నిధిలో నిరంతరం భక్తుల తాకిడితో విరాజిల్లుతున్న గొప్ప మహిమాన్వితమైన దివ్య క్షేత్రం ఇదని కొమురవెళ్లి మల్లన్న ఆలయం ను టెంపుల్ సిటీగా చేసుకుందామని వచ్చే జాతరకు వెండి తాపడంతో కూడిన ద్వారాలను ప్రారంభించుకుందాంమని మంత్రులు తెలిపారు.