వాహనదారులు తమ వాహనంపై పెండింగ్ లో వున్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వాహనాలపై విధించిన ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు తక్షణే చెల్లించాలని లేదంటే సదరు వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటనను విడుదల చేసారు.

పెండింగ్ లో వున్న చలాన్లను వాహనదారుల నుండి వసూలు చేసేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతోందని. ఈ తనీఖీల్లో చలాన్లు పెండింగ్ వున్న వాహనాలను గుర్తించి పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేయబడుతున్నాయిని. నిన్నటి రోజున ప్రారంభమయిన ఈ వాహన తనిఖీల్లో వరంగల్, ఖాజీపేట, హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 95 వాహనాలకు సంబంధించి మొత్తం 399 పెండింగ్ చలాన్లను గుర్తించి మొత్తం ఒక లక్ష 34వేల రూపాయల జరిమానాలను వసూలు చేయడం జరిగిందని. ఇకనైన వాహనదారులు పెండింగ్ చలాన్లను తక్షణమే చెల్లించాలని ఇలా పెండింగ్ జరిమానాలు చెల్లించకుండా వాహనదారులు ఆలసత్వం వహించే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ముఖ్యంగా వాహనదారులు తమ వాహనంపై ఎమైనా ట్రాఫిక్ జరిమానాలు వున్నాయో లేదో తెలుసుకోనేందుకుగాను https://echallan.tspolice.gov.in అనే వెబ్ సైడ్ లో తెలుసుకోవచ్చని. ఒక వేళ చాలాన్లు పెండింగ్ లో వున్నట్లయితే పేటియం లేదా సమీప మీ సేవా కేంద్రం ద్వారా జరిమానాలు చెల్లించవచ్చని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.