{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1627990246455","source":"other","origin":"gallery"}

చిన్న చిన్న కార‌ణాల‌తోనే వివాహాబంధాలు విడాకుల‌కు దారితీస్తున్న ఈ ప‌రిస్థితుల్లో అంద‌రూ ఈ బ‌బుల్ మ్యాన్ క‌థ తెల్సుకోవాల్సిందే, వీరిని చూసైనా త‌మ బంధాన్ని మ‌రింత బ‌లంగా మార్చుకోవాలి. ఈ ఫోటోలో ఉన్న‌ది మ‌హ్మ‌ద్ ఉమ‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌బుల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన ఈయ‌నకు భ‌యంక‌ర‌మైన చ‌ర్మ‌వ్యాధి ఉంది. 28ఏళ్ల వ‌య‌స్సుల్లో ఉమ‌ర్ ను ప‌ర్హ‌త్ ప్రేమించింది అప్పుడ‌ప్పుడే ఉమ‌ర్ కి ఈ చ‌ర్మ వ్యాధి ప్రారంభ‌మైంది అప్పుడు ఆ వ్యాధి ప్రైమ‌రీ స్టేజ్ లో ఉంది. ప‌ర్హ‌త్ ను ఆమె కుటుంబ స‌భ్యులు హెచ్చ‌రించారు రాను రాను ఈ వ్యాధి శ‌రీర‌మంతా సోకుతుంది అత‌డిని చేసుకొని నువ్వు చాలా ఇబ్బంది ప‌డ‌తావ‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అయినా ప‌ర్హ‌త్ ఉమ‌ర్ ను పెళ్లి చేసుకోవ‌డానికే రెడీ అయిపోయింది. పెళ్లైంది ఇద్ద‌రు పిల్లులు క‌లిగారు, ప‌ర్హ‌త్ ఫ్యామిలీ హెచ్చ‌రించిన‌ట్టుగానే ఆ వ్యాధి ఉమ‌ర్ శ‌రీర‌మంతా వ్యాపించి చూడ‌డానికి భ‌యంక‌రంగా మారిపోయాడు ఉమ‌ర్. అయినా ప‌ర్హ‌త్ అత‌డితోనే త‌న జీవితాన్ని పంచుకుంది. ఇప్పుడు ఉమ‌ర్ కు 62 సంవ‌త్స‌రాలు అదృష్టవ‌శాత్తు అత‌ని ఇద్ద‌రు కొడుకుల‌కు ఉమ‌ర్ వ్యాధి రాలేదు.