మర్డర్, సస్సెన్స్ థ్రిల్లింగ్ సినిమా

శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో హీరోయిన్ ఈషా రెబ్బా లీడ్ రోల్ నటిస్తున్న సినిమా రాగల 24 గంటల్లో. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. ఈషాకు జంటగా సత్యదేవ్ నటించాడు. అందచందాలతో యూత్ కి పిచ్చెక్కిస్తున్న ఈషా ట్రైలర్ లో ఆకట్టుకుంది. ‘నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేనంటూ ఈషాతో సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది.

ఓ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా..నా భర్తను నేనే చంపేశానంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు ఆసక్తిగా ఉన్నాయి. మర్డర్, సస్సెన్స్ థ్రిల్లింగ్ గా సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ రాఘవేంద్రరావు విడుదల చేశారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.