మైనారిటీ ప్రజాలా కోసం ఒవైసి హాస్పిటల్స్ ని ఐసోలేషన్ సెంటర్ గా పెట్టె దమ్ము అసదుద్దీన్ ఒవైసీ కి ఉందా అని అడుగుతున్న:-

గత కొన్ని రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోణ వైరస్ పట్ల ప్రజలు అందరూ కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేయాలి అలా చేయాలంటే అందరూ తమ ఇంట్లోనే ఉండి అధికారులు సూచించినట్లు లాక్ డౌన్ పాటించాలి.. మరియు గత కొన్ని రోజుల క్రితం కరీంనగర్ లో ఒక వర్గం కు చెందిన కొంతమంది కొన్ని ప్రాంతాల్లో తిరగడంతో అక్కడి ప్రజలు వైరస్ కి గురి అవ్వడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే, మరియు ఇప్పటికైనా అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా అధికారులను సహకరించాలని కోరుతున్నాము .. వల్లే స్వచ్ఛందం వచ్చి వైద్యం చేయించుకోవాలి..

మరియు గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల పైన జరిగిన దాడి చాలా దుర్మార్గపు చర్య.. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.. డాక్టర్లు వాళ్ల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు వాళ్ళ వృత్తిని నమ్ముకొని మనకోసం రాత్రి పగలు తేడా లేకుండా వ్యాధి సోకిన వారిని చికిత్స అందిస్తున్నారు ఇలాంటి వారిపై కొంతమంది మూర్ఖులు దుర్మార్గులు డాక్టర్ల పైన దాడి చేయడం పై బిజెపి మైనార్టీ మోర్చా దీనిని తీవ్రంగా ఖండిస్తుంది వాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరియు మైనార్టీల ఓట్లకు కొమ్ముకాసే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటివరకు కరోణ వ్యాధి పట్ల నోరు ఎందుకు విప్పలేదు మైనారిటీ ప్రజలకు పిలుపును ఇవ్వలేదు. అని అడగుతున్నాం మరియు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లోనే గృహనిర్బంధం అయ్యాడు ఇది చాలా సిగ్గుచేటు విషయం ఎందుకంటే తమ స్వార్థం కోసం మైనార్టీలను ఓట్ల కోసం వాడుకొని చేతులు దులుపు కున్నాడు దీనిని మైనార్టీ ప్రజలు గమనిస్తున్నారు ముస్లిం సమాజం ఈప్పుడైనా ఎంఐఎం పార్టీని బుద్ధి చెప్పాలని కోరారు.

దేశం కోసం ప్రజల కోసం నిరీక్షణం సేవచేసే నాయకుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు ..తాను మాట్లాడే మరియు ఎంఐఎం పార్టీ ప్రవర్తించే తీరును మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఎంఐఎం పార్టీని దేశంలోనే లేకుండా చేస్తాం మరియు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే సిద్ధాంతం తోనే బిజెపి నడుస్తుందని తెలిపారు బిజెపి ఎప్పుడు దేశ ద్రోహుల కే వ్యతిరేకం..

బిజెపి లో ఉన్న గౌరవం మైనార్టీలకు ఏ పార్టీలో దొరకదు మరియు అన్ని మతాలకు కులాలకు ఇచ్చే గౌరవం బిజెపి తప్ప మరి ఎవరు ఇవ్వరు. అసదుద్దీన్ ఓవైసీ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో దారుస్సలాం లోనే అడ్డుకుంటాం మైనార్టీ యువకులను రెచ్చగొట్టి వారికి చెడు మార్గాన్ని చూపిస్తున్న ఎంఐఎం పార్టీ రోజులు దగ్గరపడ్డాయి అన్నారు మరియు ఈ వైరస్ పట్ల మైనార్టీ ప్రజలు ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు డాక్టర్లకు ఏ క్షణం అంటే ఆ క్షణం పూర్తి సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ బిజెపి మైనార్టీ మోర్చ అధ్యక్షులు ఎండి సమీ పర్వేజ్. ప్రధాన కార్యదర్శి ఎండి ఆరిఫ్ ఖాన్. పాల్గొన్నారు…