ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం గదిలో వేసి నిర్బంధించింది. డీఎంవో సుల్తానా కొవిడ్‌ లక్షణాలతో చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలకు చికిత్స ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం రూ. 1.15 లక్షల బిల్లు వేసింది. బిల్లు అంత ఎందుకు వేశారని అడిగితే తనను నిర్భందించారని సెల్ఫీ వీడియోలో సుల్తానా పేర్కొన్నారు. ఘటనపై ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందిస్తూ, సుల్తానా తమ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం పరీక్షలో సుల్తానాకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందన్నారు. కాగా ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ఆమె ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు. సమాచారం ఇస్తే మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకునే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.