రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకి ఆయన కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.