! కాజీపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి ముఖ్య సూచన !

ఈ నెల అనగా డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం 05:00 గంటల నుంచి ఉదయం 05:00 గంటల వరకు కాజీపేట పొలీసు స్టేషన్ పరిదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు టీమ్లు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును. పరిక్షించు సమయంలో విడియో రికార్డు చేయబడును. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధినం చెసుకోబడును.

ఆ రోజు ప్రయణించు వారు పై విషయాన్ని గమనించగలరు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించు సమయంలో పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగును. ఆ సమాచారం ఉద్యోగం మరియు వీసా మరియు పాస్ పోర్ట్ ఇంకా మిగతావి జారీ చెయు సమయంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన వ్యక్తులకు జైలు మరియు జరిమానా కూడా విదించ బడును తల్లి దండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ,బయట తిరగకుండా అదుపులో వుంచుకోగలరు.

మద్యపానం సేవించి స్నేహితులతో రోడ్డుపై ప్రయాణించి నట్లయితే ప్రమాదాలకు గురియై ప్రాణాలు పోవుటకు అవకాశం వుంటుంది . ఈ సంతోషకరమైన దినమును విషాదకరమైన దినముగా మారకుండా చుసుకోనగలరని కాజీపేట పోలీస్ వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విజ్ఞప్తి చేయుచున్నారు. రావుల నరేందర్. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కాజీపేట