డెంగీతో యువ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన హవేళిఘనాపూర్ మండలం నాగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

వివరాలు. గ్రామానికి చెందిన ఒంటరి నరేందర్ రెడ్డి మంజుల కుమార్తె భవ్య ( 21 ) నర్సాపూర్ బీవి ఆర్ ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ CSC ఫైనల్ యర్ చదువుతుంది. భవ్యకు ఐదు రోజులు క్రితం డెంగీ జ్వరం సోకడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు మెదక్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగగైన చికిత్స కోసం హైదరా బాలోని రష్ ఆసుపత్రికి తరలించారు .

అక్కడ పరిస్థితి విషమిం చడంతో యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఎంతో ఖర్చుతో చికిత్స చేయించినప్పటికీ భవ్య మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి . భవ్య ఇటీవల క్యాంపస్ లో నిర్వహించిన సెలక్షన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి నియామకమై ఉద్యోగంలో చేరక ముందే మృత్యువు ఒడికి చేరడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం భవ్య అంత్యక్రియలు స్వగ్రామమైన నాగాపూర్ లో నిర్వహించారు .