ఇండోనేషియాకు చెందిన ఓ మహిళకు పెళ్లైన 10 నెలల త‌ర్వాత‌ భారీ షాక్ తగిలింది. ఈ విచిత్రమైన ఘటనలో వరుడు నిజానికి పురుషుడు కాదని ఆ మహిళకు లేటుగా అర్థ‌మ‌య్యింది. అయితే, ఈ లోపు జ‌ర‌గాల్సిందంతా జరిగింది. డేటింగ్ యాప్‌లో క‌లిసిన వ్య‌క్తి మాట‌లు విని, న‌మ్మిన ఆమె వివాహానికి సిద్ధ‌ప‌డింది. రెండ‌వ మ్యారేజ్ చేసుకోడానికి త‌న‌కు ఒక మ‌హిళ కావాల‌ని, తాను ఒక‌ సర్జన్ అని చెప్ప‌డంతో ఆమె గుడ్డిగా న‌మ్మింది. అతనికి వ్యాపారం కూడా ఉందని తెలిసి, అదృష్ట‌వంతురాలిని అనుకుంది. తర్వాత, ఆ జంట రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత‌ దంపతులిద్ద‌రూ ఆమె త‌ల్లింద్ర‌డుల‌తో పాటే ఉన్నారు. అప్పుడు వరుడు డబ్బు కోసం వధువు కుటుంబాన్ని వేధించడం మొద‌లుపెట్టాడు.

కొన్నాళ్ల‌కు ఇద్ద‌రూ దక్షిణ సుమత్రాకు మారిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు మ‌రింత‌ గందరగోళంగా మారాయి. కోకోన‌ట్స్ జ‌క‌ర్తా కథనం ప్రకారం, ఆమెను ఇంట్లోనో బంధించి ఉంచేవాళ్లు. అప్పుడు అస‌లు విష‌యం తెలిసింది. తాను చేసుకుంది ఒక మ‌హిళ‌న‌ని ఆమెకు అర్థ‌మ‌య్యింది. ఆచూకీ తెలియ‌కుండా త‌న‌ను ఇక్క‌డికి తీసుకొచ్చి బంధించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌య్యింది. ఇలాంటి ప‌రిస్థితిలో ఆమె త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌ర్వాత‌ ఆ జంట ఆచూకీ లభించింది. వధువు జూన్ 14, మంగళవారం ఇండోనేషియాలోని జంబి జిల్లా కోర్టులో కేసు నమోదు చేసింది. పెళ్లైన ద‌గ్గ‌ర నుండి డ‌బ్బుల కోసం వేధించిన‌ట్లు ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. వధువు ‘భర్త’ తన కుటుంబం నుండి అప్ప‌టికే రూ. 15లక్షలు తీసుకున్నాడ‌ని వెల్ల‌డించింది.