వరంగల్ కు చెందిన 32 ఏళ్ల ఓ మహిళపై తన ప్రియుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది.

వివారాలు: వరంగల్ జిల్లా, హన్మకొండకు చెందిన బాధితురాలు సికింద్రబాద్ లోని ఓ క్యాథ్లెక్ చర్చిలో పనిచేస్తుంది. ఈ సమయంలో వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన పి సందీప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. అయితే, గత డిసెంబర్ 18న ఆఫీస్ సిబ్బందితో కలిసి ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ కూడా ఢిల్లీ వెళ్లి ఆమెను కలిశాడు. అనంతరం ఇక్కడి పర్యటక ప్రాంతాలను చూపిస్తానని చెప్పి ఒక రూమ్ బుక్ చేశాడు.

ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు, దీంతో బాధితురాలు షాక్ లోకి వెళ్లడంతో సోమవారం హన్మకొండలోని ఇంటివద్ద ఆమెను వదిలి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీ పర్యటన గురించి అడగగా వింతగా ప్రవర్తించింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఏం జరిగిందని ఆమె స్నేహితులకు ఫోన్ చేయగా, సందీప్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక సుబేదారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.