సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగాన్‌ స్కాట్‌ తండ్రి అయ్యింది. తన భాగస్వామి జెస్ హోలియోక్‌ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా మెగాన్‌ స్కాట్‌ పంచుకుంది. మా క్యూట్‌ బేబీ ఎమర్జెనీ సి సెక్షన్ ద్వారా ఈ భూమి మీదకు వచ్చిందిని ఆమె ట్విట్‌ చేసింది. ఆగస్టు 17న జన్మించిన చిన్నారికి ‘రిలీ లూయిస్ స్కాట్’ అని పేరు కూడా పేట్టేశారు. 24వారాల మా నిరీక్షణకు ఫలితం దక్కిందిని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి ఇద్దరు అందమైన అమ్మాయిలు నా జీవితంలో ఉండడం నా అదృష్టం’ అంటూ మెగన్ స్కాట్ పేర్కొంది.

కాగా 2018 ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేశారు. దీంతో 2019లో తన చిరకాల భాగస్వామి అయిన జెస్ హోలీయోక్‌ను మేగాన్‌ స్కాట్‌ వివాహం చేసుకుంది. ఈ ఏడాదిలో మేలో జెస్ హోలియోక్‌ గర్బం దాల్చినట్లు స్కాట్‌ ప్రటించింది. ఆమె తన భార్య జెస్‌తో కలిసిఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది.