మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు. దీంతో మైనర్‌ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు..

ఈ సంఘటన ‌మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే: మండలంలోని తానంచర్ల శివారు డీఎస్‌ఆర్‌ జెండాల్‌ తండాకు చెందిన భూక్యా ఠాగూర్‌(48) అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

చిన్న కుమార్తె (మైనర్‌) ను పక్క తండాకు చెందిన ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్‌ చేయించాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఠాగూర్‌ రాత్రి ఇంటిపక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు…