వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో భార్యను చితకకొట్టాడు ఓ భర్త. భార్యతో పాటు మరో యువకుడిని ఇంట్లో ఉండగా చూసి తట్టుకోలేకపోయాడు. ఇద్దర్ని ఇంట్లో బంధించి కర్రలతో విచక్షారహితంగా కొట్టాడు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడు భార్య ను అనుమానంతో చిత్రహింసలు పెడుతుండగా గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మొగుడి మూర్ఖత్వం బయటపడింది. ఉదయ్‌పూర్‌లోని పాధా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్న బాధిత మహిళతో పాటు మరో వ్యక్తి ఇంట్లో కనిపించడంతో భర్త అనుమానంతో రగిలిపోయాడు.

ఇద్దర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అనుమానించాడు. ఇద్దర్ని ఇంట్లో కొయ్యకు కట్టేసి తాను, మరో వ్యక్తి కలిసి కర్రలతో అతి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా భార్య తప్పు చేసిందన్న కోపంతో ఆమెను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించాడు భర్త. బాధిత మహిళ కొట్టవద్దంటు వేడుకుంటున్న వినిపించుకోకుండా కర్రలు విరిగేలా ఆమెపై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. కట్టుకున్న భార్య తప్పు చేసిందనే అనుమానంతోనే భర్త టార్చర్ పెడుతుంటే అడ్డుకోవాల్సిన కుటుంబ సభ్యులు కూడా అతనికి వంత పలుకుతూ వాళ్లు కూడా కర్రలతో కొట్టారు.