ఈ రోజు జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో జిల్లా యస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.యెస్ గారు జిల్లా పోలీసు అధికారులు మరియు న్యాయ శాఖ అధికారులతో జువైనల్ జస్టిస్ ఆక్ట్ 2015 మరియు న్యాయ విచారణ ప్రక్రియలో నూతన తీర్పు, పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ వారి సంరక్షణకు తీసుకోవాల్సిన చట్టపరమైన అంశాలను గూర్చి ఉమ్మడి మెదక్ జిల్లా సిబ్బంది మరియు న్యాయశాఖ అదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయశాఖ అదికారుల సలహాలు, సూచనలు పోలీసు సిబ్బంది తీసుకుని నేరస్తులకు శిక్షలు పడేవిదంగా చేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా యెస్.పి గారు మాట్లాడుతూ నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, వారితో దొంగతనాలు చేయించడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోందిని, ఇది ఘోరమైన నేరంమని , అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమతో ఉంటూ వారికి కుటుంబ వ్యవస్థ, సామాజిక విషయాలు, బాధ్యత వంటివి నేర్పించడం ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగా తమ వ్యక్తిగత భద్రత పట్ల తగిన సూచనలు చేయడం వలన మంచీచెడు విషయాల పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు. పోలీసు శాఖ పక్షాన బాల్యానికి రక్ష కార్యక్రమాలు నిర్వహిస్తూ, జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పోలీసు కళా బృందము వారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న విషయాన్ని ఎస్.పి. గారు గుర్తు చేశారు.

పిల్లల జీవనశైలి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది:

పిల్లల జీవనశైలి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇందువలన మనం గర్వపడే విధంగా మన పిల్లలు ఎదుగుతారని అధికారి పేర్కొన్నారు. బాలల రక్షణకై కఠిన చట్టాలు ఉన్నాయని, బాలలపై అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి కఠిన దండన తప్పదని హెచ్చరించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయిందిని, తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదని, అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా – దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి అనేక పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ – పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారని , ఈ సంధర్భంగా తెలిపినారు. కావున ఇలాంటి వారిపైన తీసుకోవాల్సిన చట్టపరమైన అంశాలను గూర్చి న్యాయ శాఖ అధికారులతో జువైనల్ జస్టిస్ ఆక్ట్ 2015 మరియు న్యాయ విచారణ ప్రక్రియలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలను గూర్చి చర్చించి న్యాయ శాఖా అధికారులతో సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని తెలిపినారు.

ఈ సందర్భంగా శ్రీ.ఇ.కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ ఏ.పి.పి జె.యఫ్.సి.యమ్ కోర్ట్ బోదన్ గారు మాట్లాడుతూ పిల్లలను అమ్మటం, కొనటం వారితో స్మగ్లింగ్ రవాణా, వారిని బాల కార్మికులు గా మార్చటం అలాగే చిన్న పిల్లలకు వాహానాలు ఇవ్వటం లాంటి అంశాలు నేరం అని, ఈ జువైనల్ జస్టిస్ ఆక్ట్ 2015 ప్రకారం వారు శిక్షార్హులని తెలిపినారు. ఈ సమావేషంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ.శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి గారు, శ్రీ.రాంబక్షి అడిషనల్ పి.పి మెదక్ గారు, శ్రీమతి. నిర్మలా సీనియర్ ఏ.పి.పి మెదక్ గారు,శ్రీమతి ఫిర్దోజ్ సీనియర్ ఏ.పి.పి సంగారెడ్డి గారు, శ్రీమతి సుజన ఏ.పి.పి సంగారెడ్డి గారు, శ్రీ.శ్రీపాల్ రెడ్డి ఏ.పి.పి జహీరాబాద్ గారు, శ్రీ.ధర్శన్ అడిషనల్ పి.పి సంగారెడ్డి గారు మరియు మెదక్ జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.డి. నాగరాజు గారు, మెదక్ డి.యస్.పి. కృష్ణమూర్తి గారు, తూప్రాన్ డి.యస్.పి. శ్రీ. కిరణ్ కుమార్ గారు, యెస్.బి సి ఐ శ్రీ.విజయ్ కుమార్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా సి.ఐ.లు, యస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు…