లాక్‌డౌన్ సమయంలో ఓ తల్లి సహకారంతో కూతురుపై తండ్రి రెండు సార్లు అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని మోరినా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్చి 26న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వంట రూములో ఉన్న కూతురిని (18) పట్టుకెళ్లి బెడ్‌రూమ్‌లో పడేసి తాళ్లతో చేతులను కట్టాడు. అనంతరం తల్లి నోట్లో గుడ్డలు పెట్టగా కన్న కూతురుపై తండ్రి అత్యాచారం చేశాడు.

తల్లితండ్రి రూమ్‌లో ఉన్నప్పుడు బయట వైపున గడియ పెట్టి అక్కడి నుంచి కూతురు తప్పించుకొని తన అత్తమ్మ వాళ్లంటికి వెళ్లింది. కూతురుని అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి తన ఇంటికి తీసుకొచ్చి ఏప్రిల్ 10న కూతురుపై కన్న తండ్రి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన సొదరి 1098కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌పి అశిత్ యాదవ్ తెలిపాడు. హైస్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి తనను తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది.