భర్త ప్రతిరోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక 5నెలల గర్భిణీ అయిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: కర్ణాటకలోని రామనగర మంజునాథనగరానికి చెందిన దంపతులకు 9నెలల క్రితం వివాహమైంది. అయితే, భర్త ప్రతిరోజూ రాత్రిపూట తాగొచ్చి చిత్రహింసలకు గురి చేసేవాడని, దీంతో ఆమె విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. మృతురాలు ప్రస్తుతం 5నెలల గర్భిణీ అని, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.