తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు తిరుమలలో తీవ్ర పరాభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తిరుమలకు వచ్చారు. కాగా అయ్యినప్పటికీ హరీష్ రావుకు టీటీడీ ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

ఇదిలా ఉండగా: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి . ఈ రోజు శ్రీవెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందని నమ్మకం . అందుకే అన్ని ఆలయాల్లో భక్తులు బారులు తీరి ఉన్నారు . ఇక తిరుమలలో పరిస్థితి అయితే . . ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు .

వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు:

హైకోర్టు సీజే మహేశ్వరి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌కుమార్, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతంరెడ్డి, రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాగే తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సుమలత, సునీల్, సప్తగిరి లు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.