శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్టీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు..