శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. ఆదివారం (జనవరి 5, 2020) తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. పాలక మండలి భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ జనవరి 20 నుంచి శ్రీవారి దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డు అందిస్తామని వెల్లడించారు. అదనంగా డబ్బులు చెల్లించి ఎన్ని లడ్డూలైనా తీసుకోవచ్చన్నారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తుడికి , ఉచితంఅందిస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చే భక్తుడికి మాత్రమే ఉచిత లడ్డూ ఇస్తామని తెలిపారు.

తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూ ఇవ్వాలంటే సాధ్యం కాదన్నారు. రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. రేపు తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఎన్నిరోజులు తెరిచి ఉంచాలనే అంశంపై అత్యవసర సమావేశంలో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో చాలా మంది సభ్యులు పదిరోజులు వైకుంఠ ద్వార దర్శనానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. 10 రోజుల వైకుంఠ దర్శనం అంశంపై పీఠాధిపతులు, స్వామీజీలు హైకోర్టులో పిటివేశారని చెప్పారు. వైకుంఠ ఏకాదశిని పదిరోజులు పెంచేందుకు మీ అభిప్రాయం చెప్పాలని టీటీడీకి హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై ఓ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీకి ఏఈవో కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. టీటీడీ బోర్డులోని కొంత మంది సభ్యులను కమిటీ మెంబర్స్ గా ఉంటారని చెప్పారు. ఎవరైతే స్వామీజీలు, పీఠాధిపతులతో అధ్యాత్మికంగా మాట్లాడుతారో పరిశీలించి వారిని నియమిస్తామని చెప్పారు. కమిటీ సభ్యులు స్వామీజీలు, పీఠాధిపతులతో మాట్లాడుతారని తిరుమలలో ఉన్న పద్ధతులు, ఆచార వ్యవహారాలను వారికి వివరిస్తారని చెప్పారు.