తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు దర్శించుకున్నారు.

తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెంకన్న సందర్శించుకున్నట్లు తెలిపారు వరంగల్ నగర ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తూ, రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు దాస్యం వినయ్ భాస్కర్ తన కార్యకర్తలకు , శ్రేయోభిలాషులకు, అభిమానులకు విసిరినా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ ను స్వీకరించి నిరుపేదలకు,

విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి పలు రకాలుగా సహాయ కార్యక్రమాలు చేపట్టి ప్లాస్టిక్ నివారణకై ర్యాలీలు జూట్ బ్యాగుల పంపిణీలు చేశారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.