{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594396470218","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594396470189","source":"other","origin":"gallery"}

తీన్మార్ మల్లన్నగా ప్రసిద్ది చెందిన నవీన్ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా కనిపించడం లేదని. ఆయన ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులు కోర్టుల ముందు ఆడితే మౌనంగా చూస్తూ ఊరుకోమని పిటిషనర్ను హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య వివరాలను ఆరా తీయాలని వేసిన ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశ్యంతో ఉందని హైకోర్టు పిటిషన్ దారు తీన్మార్ మల్లన్న(నవీన్)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సిఎం కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్ విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోలేమని మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ ధాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.