కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెంలో నిర్మాణంలో ఉన్న తుపాకులగూడెం బ్యారేజి, సమ్మక్క బ్యారేజి పనులను రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఇరిగేషన్ & సిఎడి డా. రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రెటరీ స్మిత సబర్వాల్ ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణా ఆదిత్య, ఐటిడిఏ పి.ఓ హనంతు కె జండగే వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వారు తుపాకులగూడెం బ్యారేజి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్మిత సబర్వాల్ మాట్లాడుతూ:

ప్రాజెక్ట్ పనులు 31 మార్చ్ వరకు పూర్తి చేయాలని సంబంధిత చీప్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ ని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనులు 24 గంటలు పని చేసి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ చీఫ్ (జనరల్) మురళీధర్ రావు, ఇంజనీర్ చీప్ (దేవాదుల) బి.నాగేందర్ రావు, ఎస్ఈ ములుగు సుధీర్, వెంకటేష్, ఈఈలు జగదీష్, స్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.