• అనాథలు కాదు, వాళ్లు అందరి బిడ్డలు.
  • వాళ్లకు మనమంతా మేము ఉన్నామనే భరోసా నివ్వాలి.
  • త్వరలోనే అనాథల కోసం ప్రభుత్వం పకడ్బందీ చట్టం.
  • అనాథ పిల్లలతో మంత్రి ఎర్రబెల్లి మాట ముచ్చట
  • స్నాక్స్ తింటూ, టీ తాగుతూ,
  • కుశల ప్రశ్నలు వేస్తూ, పాటలు పాడిస్తూ.
  • పిల్లలతో కలిసి కాసేపు పిల్లాడిలా గడిపిన మంత్రి.

అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదు. వారు అందరి బిడ్డలు వాళ్లకి మేమున్నామని భరోసా కల్పించడం మనందరి బాధ్యత. ఈ సమాజం బాధ్యత. తల్లి తండ్రి మాత్రమే ఉన్న మన చుట్టూ అందరూ లేరు కానీ, తల్లిదండ్రులు లేని అనాధ లకు మాత్రం మనం అందరం ఉన్నాం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం త్వరలోనే అనాధ పిల్లల కోసం ఒక సమగ్ర పకడ్బంది చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే అనాధల చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చిందని, సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అది ఒక సమగ్ర చట్టం రూపు దిద్దుకుంటుందని మంత్రి చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు కేంద్రంలోని సెయింట్ పాల్స్ స్కూల్ లో అనాథ పిల్లలతో మంత్రి మమేకమయ్యారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. వారి మంచి చెడులు తెలుసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అనాధ అయిన తీరు వాళ్లు ప్రస్తుతం ఆశ్రమంలో ఎలా ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? వారికి అందుతున్న వసతులు ఏంటి? వంటి విషయాలపై ఆరా తీశారు. కుశల ప్రశ్నలు వేశారు. అలాగే వారి చదువులు, వస్తున్న మార్కులు, భవిష్యత్ లక్ష్యాలు వంటి అనేక అంశాలను వారి ముందు ప్రస్తావించారు. అంతే కాదు.

ప్ర: నేను తెలుసా?
జ: మీరు మంత్రి
ప్ర: నేను ఏ శాఖ మంత్రిని?
జ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి

అలాగే వారి జనరల్ నాలెడ్జ్ ని కూడా పరీక్షించారు. వారితో కలిసి టీ తాగారు. స్నాక్స్ తిన్నారు. వారి అభిరుచులు అడిగి తెలుసుకున్నారు. పాటలు పాడించుకొని వారిని సంతోష పెట్టారు. ఫోటోలు దిగారు. మొత్తానికి ఆ పిల్లలతో తన పరిచయాన్ని వారి జీవితంలో మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా మిగిల్చారు. తీపి గుర్తుగా, ఓ గొప్ప అనుభూతిగా వారితో మమేకమయ్యారు. ఆ పిల్లలు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఓ తండ్రిలా, ఓ తాతలా అనురాగం పంచే ఆత్మీయుడిలా, దయా గుణమున్న దయామయుడిలా దయన్న వాళ్ళ ముందు సాక్షాత్కరించాడు.

మంత్రి వెళ్లిపోతుండగా, ఆయన వెనకే గుంపుగా వచ్చి, క్రమశిక్షణతో నిలబడి, టాటా చెప్పి, ఆ పిల్లలు అత్యంత ఆత్మీయ వీడ్కోలు ని మంత్రికి పలికారు. అంతకు ముందు మంత్రికి దారిపొడవునా నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని సందర్భాల్లో పిల్లలతో మాట్లాడుతూ కళ్ళు చెమర్చారు. వారి ఆత్మీయతకు అబ్బుర పడుతూ, వాళ్ళతో ఆనందంగా గడిపి ఆ పిల్లల్లో పసి పిల్లాడిలా మారారు. ఈ దృశ్యాలు చూసిన వారంతా మంత్రిని, ఆ పిల్లలని, నిర్వాహకులను చప్పట్లతో అభినందించారు.