• తెలంగాణ రాష్ట్రంలో వెయ్యికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • ఇవాళ కొత్తగా 985 పాజిటివ్ కేసులు నమోదు
  • ఇవాళ ఏడుగురు మృతి.. కరోనా మరణాలు 237కి చేరిక.
  • జీహెచ్ఎంసీ 774, రంగారెడ్డి 86, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్ 20, మెదక్ 9, నిజామాబాద్ సిరిసిల్ల అరేసి కేసులు నమోదు
  • ఇవాళ్టికి మొత్తం కేసుల సంఖ్య 12349 కేసులకు చేరిక

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నది. 24గంటల వ్యవధిలో కొత్తగా 985 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 774 కేసులు నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 53, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.  సిరిసిల్ల 6, సిద్దిపేట 3, ఆదిలాబాద్‌ 7, మెదక్‌ 9, ఖమ్మం 3, భూపాలపల్లి 3, ములుగు 2, జగిత్యాల 2, భువనగిరి 2, నిజామాబాద్‌ 6, నాగర్‌కర్నూల్‌ 6, వికారాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,349 కేసులు నమోదుకాగా దవాఖానలో 7,436 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 237 మంది మృతి చెందారు. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకొని ఈరోజు 78మంది బాధితులు దవాఖాన నుంచి డిశ్చార్జి కాగా ఏడుగురు మృతి చెందారు.