తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 12న బుధ‌‌వారం) 23,303 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,931 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 11 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 86,475కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 665 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,780మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 63,074కి చేరింది. 22,736 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Plpఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 298, వరంగల్ అర్బన్ 144, రంగారెడ్డి 124, సంగారెడ్డి 86, సిద్ధిపేట 71, కరీంనగర్ 89, నల్గొండ 84, మేడ్చల్ 71, ఖమ్మం 73, పెద్దపల్లి 64, సూర్యాపేట 64, జనగామా 59, గద్వాల 56, నాగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, రాజన్న సిరిసిల్ల 54, జగిత్యాల 52, భద్రాద్రి 39, కామారెడ్డి 39, మంచిర్యాల 45, మహబూబ్ నగర్ 43, మహబూబాబాద్ 34 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.