తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 492కు చేరుకుంది. కొత్తగా నమోదైన సంఖ్యను కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 58,906 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో 43,751 మంది కోలుకోగా మరో 14,663 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని బుధవారం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటిన్‌లో వెల్లడించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసలు నమోదు కాగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 69, నల్గొండలో 51, నిజామాబాద్‌లో 47 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 47, పెద్దపల్లిలో 44, వరంగల్‌ గ్రామీణంలో 41, సూర్యపేటలో 38,భద్రాది కొత్తగూడెంలో 30, నాగర్‌కర్నూలులో 29, మంచిర్యాలలో 28 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు.