తెలంగాణలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసులు 60 వేలు దాటిపోయాయి, ఇదే స‌మ‌యంలో మృతుల సంఖ్య 500ను క్రాస్ చేసింది, రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసులు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. తాజాగా, తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం: గ‌డిచిన 24 గంట‌ల్లో 1,811 కొత్త కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి ఇక‌, మ‌రో 13 మంది మృతిచెందారు, దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేర‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 505 మంది క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందారు ప్ర‌స్తుతం రాష్ట్రంలో 15,640 యాక్టివ్ కేసులు ఉండ‌గా, వీరిలో హోం క్వారంటైన్‌లో 10,155 మంది ఉన్నార‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. మ‌రోవైపు గ‌త 24 గంట‌ల్లో 821 మంది క‌రోనా నుంచి కోలుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 44,572కు పెరిగింది..

నేడు జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ 18, భద్రాద్రి 27, హైదరాబాద్ 521, జగిత్యాల 15, జనగాం 22, భూపాలపల్లి 20, గద్వాల 28, కామారెడ్డి 11, కరీంనగర్ 97, ఖమ్మం 26, ఆసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 41, మహబూబాబాద్ 39, మంచిర్యాల 18, మెదక్ 15, మేడ్చల్ 151, ములుగు 16, నాగర్ కర్నూల్ 9, నల్లగొండ 61, నారాయణపేట 9, నిర్మల్ 12, నిజామాబాద్ 44, పెద్దపల్లి 21, సిరిసిల్ల 30, రంగారెడ్డి 289, సంగారెడ్డి 33, సిద్దిపేట 24, సూర్యాపేట 37, వికారాబాద్ 12, వనపర్తి 23, వరంగల్ రూరల్ 18, వరంగల్ అర్బన్ 102, యాదాద్రి 16 కేసులు నమోదయ్యాయి.