ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం చేసున్నారు. గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో గీత కార్మికుల సదస్సులో పాల్గొన్నారు టీఆర్ఎస్‌ నేతలు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేశామని చెప్పారు. ఇక, కార్యకర్తల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికల్లో డబ్బులు, మద్యంతో గెలిచే తప్పుడు సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఉత్తమ్ మండిపడ్డారు, మరోవైపు ప్రచారంలో అన్ని పార్టీలు వేగం పెంచాయి బీజేపీ అభ్యర్ధి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిడమనూరులో బీజేపీ అభ్యర్ధి రవికుమార్‌ మహిళలతో కలసి కోలాటం ఆడుతూ ప్రచారం చేశారు. మొత్తానికి సాగర్ పోరులో పార్టీలు పోటాపోటీ ప్రచారంతో సాగర్ ఉపఎన్నికల రాజకీయం హీటేక్కింది మరో రెండు రోజుల్లో పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొనన్నారు. ఈ సందర్భంగా మాటల తూటాలు పేలే అవకాశం లేకపోలేదు ఇప్పటికే ఆరోపణలు, విమర్శలతో సాగర్‌లో పొలిటికల్ హీట్పెరిగిపోగా స్టార్ క్యాంపెయినర్లు రంగం ప్రవేశం చేస్తే పరిస్థితి వేరుగా ఉండడం ఖాయం అంటున్నారు.