హైదరాబాదులో దిశ పై జరిగిన రాక్షస కాండ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రం లోని సర్కారు బడుల్లో విద్యార్థిను లకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇవ్వను న్నారు. ఆత్మరక్షణ శిక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ రూ.1.38కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వందకు మించి విద్యార్థులున్న 1,513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.3వేలు చొప్పున మంజూరు చేశారు. వారంలో రెండు మార్షల్‌ ఆర్ట్స్‌ తరగతులను గంట చొప్పున నిర్వహించాలని పేర్కొన్నారు. జాతీయ క్రీడా సంస్థలు లేదా యూనివర్సిటీ నుంచి జూడో, మార్షల్‌ ఆర్ట్స్‌లో సర్టిఫికెట్‌ ఉన్న శిక్షకుడిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా ఆత్మరక్షణ కోసం కొంతైనా ప్రయాణం ఉంటుందని ప్రభుత్వం సంకల్పించి కరాటే అమలు చేయాలని నిర్ణయించింది.