తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో సామాజిక దూరమును పాటించి జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసారు. అనంతరం జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ:

తెలంగాణా అమరవీరుల త్యాగ పలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైందని, ఎంతో మంది గొప్ప, గొప్ప వ్యక్తులు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా తెలంగాణా రాష్ట్ర సాధనకు అలుపెరుగని కృషి చేసారని అన్నారు. అదేవిదంగా పోలీసు శాఖ లో పనిచేసే ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తమ వంతు బాధ్యతగా ప్రజా రక్షణే కర్తవ్యంగా, ప్రజల సేవయే ధ్యేయంగా పనిచేస్తు, తెలంగాణ పోలీసు సేవలను ప్రజలకు మరింతగా అందించి తెలంగాణ పోలీసు కు మరియు జిల్లా పోలీస్ శాఖకు మరింతగా మంచి పేరు వచ్చేవిధంగా పనిచేయాలని అన్నారు, అదేవిధంగా కలిసి కట్టుగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. గారితో పాటు, జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ. డి.నాగరాజు గారు, ఏ.ఓ. కళ్యాణి గారు, మెదక్ డి.ఎస్.పి. శ్రీ. పి. క్రిష్ణమూర్తి గారు, రూరల్ సి.ఐ. రాజశేకర్ గారు, టాస్క్ ఫోర్స్ సి.ఐ. చంద్రయ్య గారు, ఆర్.ఐ. సూరపునాయుడు గారు, ఎస్.ఐ. ఎస్.ఐ. సందీప్ రెడ్డి, ఐ.టి.కోర్. ఎస్.ఐ. ప్రభాకర్, ఎస్.ఐ. కమలాకర్ గార్లు, డి.పి.ఓ. సిబ్బంది, ఎస్.బి. సిబ్బంది, డి.సి.ఆర్.బి. సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.